03 Nov 2026 | 01:16 AM

మురసు తుఫాన్ ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలి అంటున్న పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల జిల్లాలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగ కూడదు తుఫాన్ ప్రభావం జిల్లాలో ఈ రోజు రేపు ఎక్కువుగా ఉంటుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ కె నాగరాజు) తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల సూచించారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.సోమవారం తుఫాను సన్నద్ధత పైన జిల్లా మరియు మండల స్థాయి అధికారులతో టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం అందిన అంచనాల ప్రకారం తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడి, నవంబర్ 2వ తేదీ రాత్రి నుంచి 3వ తేదీ తెల్లవారుజాము మధ్య నెల్లూరు–ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముందస్తు చర్యల్లో భాగంగా డ్రెయిన్లు, కాలువల బలహీన ప్రాంతాలను ఇసుక బస్తాలతో పటిష్టపరిచే పనులు చేపట్టాలి అన్నారు . వంతెనలు, క్రాసింగ్‌ల వద్ద నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న గుర్రపుడెక్క తదితరాలను యంత్రాలతో తొలగించి, నీరు సాఫీగా ప్రవహించేలా ఏర్పాట్లు చేయాలి అన్నారు .తుపాన్ కదలికలను అవేర్ వెబ్సైటు ద్వారా ప్రజలు రియల్ టైమ్ లో చూసి తెలుసుకోవచ్చు. దీనికోసం https://aware.ap.gov.in/dashboard వెబ్సైటును సందర్శించండి. అవేర్ యాప్ ను మీ మొబైల్ ఫోనులో డౌన్లోడు చేసుకోవడం ద్వారా మీ ప్రాంతంలో వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అన్నారు . ఆర్ & బీ శాఖ అధికారులు వర్షాల కారణంగా దెబ్బతినే రహదారులు, వంతెనలపై ప్రత్యేక నిఘా ఉంచాలి.కల్వర్టులు, కాజ్‌వేలు, వంతెనల వద్ద వరద ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించాలి.రహదారులపై వరద నీరు ప్రవహించే ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించాలి.ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి.రహదారులు దెబ్బతిన్న చోట తక్షణ మరమ్మతులు చేపట్టేందుకు సిబ్బంది, యంత్రాలను సిద్ధంగా ఉంచాలి అన్నారు భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా రహదారులపై చెట్లు కూలితే వెంటనే తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి అన్నారు . ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, అన్ని శాఖల సమన్వయంతో తుపాను పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలి అన్నారు. మైనర్ ఇరిగేషన్ చెరువుల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఇరిగేషన్ శాఖ సిబ్బందితో సిబ్బందితో చెరువుల నీటి నిల్వ సామర్ధ్యం, గట్ల పటిష్టత పరిశీలించాలి అన్నారు .స్తంభాలు, కండక్టర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, కేబుల్స్, ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచాలని తెలిపారు .తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ లక్ష్యంగా పనిచేయాలని ఆదేశం చేసారు .ముందు గానే తగిన వసతులతో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి అన్నారు . అదేవిధంగా రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉన్న ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు .బ్యాలట్ పేపర్లు తడవకుండా అప్రమత్తగా ఉండాలి అన్నారు .