పయనించే సూర్యుడు న్యూస్ మే 22 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గం వజ్రపూ కొత్తూరు మండలం నువ్వుల రేవు గ్రామానికి సంబంధించిన మువ్వల నగేష్ అనుమానస్పద మృతి పై ఎలాంటి పురోగతి లేదని పలాస మాజీ పిఎసిఎస్ అధ్యక్షుడు సీనియర్ వైయస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దువ్వాడ శ్రీధర్ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కు సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంపై ఆయన నివాసములో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 2024లో పలాసలో జరిగిన యువగళం సభలో టిడిపి నాయకులు నారా లోకేష్ మువ్వల నగేష్ అనుమానస్పద మృతి పై తమ ప్రభుత్వం రాగానే 100 రోజులలో పూర్తి వివరాలతో దర్యాప్తు చేసి, కారకులైన వారిని శిక్షిస్తామని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయిన ఇంతవరకు ఎమ్మెల్యే ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కారణమేమిటిని ఆయన ప్రశ్నించారు. ఒక మహిళ ఎమ్మెల్యే ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకోకుండా కనీసం ఆ కుటుంబానికి ఎలాంటి సహాయం చేయకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. పలాస కి ఎమ్మెల్యేగా మీరు ఏం చేశారని, పలాస జిల్లా వస్తుందని ఎమ్మెల్యేగా మీరు ,మీ భర్త వెంకన్న చౌదరి, ఒక సందర్భంలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి జిల్లా గురించి మీరు ఎందుకు మౌనం దాల్చారో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. జనసేన ప్రోద్భలంతో నువ్వలరేవులో గల 4500 ఓట్లు ఆ గ్రామం నుండి మీకు వచ్చాయని, ఆ విశ్వాసం కూడా ఒక మహిళ ఎమ్మెల్యేకి లేకపోవడం ఆశ్చర్యం గురిచేస్తుందని అన్నారు. మువ్వల నగేష్ విషయం గురించి మీ నాయకుడు లోకేష్ మరిచారా? లేదా మీరు ఆయనకు ఈ విషయాన్ని గుర్తు చేయలేదా? లేదా ఇంకేమైనా లొసుగులు ఉన్నాయా? అని ఆయన సూటిగా ఎమ్మెల్యేని ప్రశ్నించారు. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి తిట్టడం తప్ప మీరు పలాస నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, మహిళా అని కూడా మర్చిపోతున్నట్లు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. నేను పలాస లోకల్ వ్యక్తినని మీరు సోంపేట నుండి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయటం, మమ్మల్ని భయపెట్టడం చేస్తే సహించేది లేదని మా వైపు ప్రజలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. పలాస నియోజకవర్గం లో మద్యం ఎమ్మార్పీ రేట్ కి 20 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారని, కూలింగ్ పెడితే 30 రూపాయలు తీసుకుంటున్నారని, గ్రామాలలో అదనముగా 50 రూపాయలు తీసుకుంటున్నారని, ఈ విషయాలు మీకు తెలియదా? మహిళా నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మద్యం ఏరులై పారడం సిగ్గుచేటని , మహిళలు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలందరూ మీ యొక్క పాలనను చూస్తున్నారని త్వరలో వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మువ్వల నగేష్ అనుమానస్పద మృతిని పై పూర్తిగా దర్యాప్తు చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, లేదంటే దీనిపై తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.