ముస్లిం సోదరసోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

★ గ్రామ సర్పంచ్ - బచ్చలకూర శ్రీనివాసులు

పయనించే సూర్యుడు, మే 28 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని చేర్కూర్ గ్రామ ముస్లిం సోదరసోదరీమణులకు ఆయన బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భక్తికి, త్యాగానికి, సహనానికి బక్రీద్ పండుగ ప్రతీక అని చేర్కూర్ గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు పేర్కొన్నారు. భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగను జరుపుకోవాలని సూచించారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ పండుగను జరుపుకుంటారని అన్నారు. పేదల పట్ల జాలి, దయ కలిగి ఉండటమే బక్రీద్‌ ఇచ్చే సందేశమన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.