మూగజీవాల దాహార్తి తీర్చడానికి దాతృత్వం చూపిన ఎన్నారై

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మే 24 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేట గ్రామంలో నిరుపయోగంగా ఉన్నటువంటి నీటితొట్టిని, బోరు బావి మోటారు లేక పశువులకు ఎండాకాలంలో తీవ్రమైన ఉష్ణోగ్రతల మధ్య నీరు దొరకని ఇబ్బందికర పరిస్థితులలో గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కోల శ్రీనివాస్ పరిస్థితులను అర్థం చేసుకొని కొత్తవాడలో నిరుపయోగంగా ఉన్నటువంటి నీటి తొట్టి అపరిశుభ్రంగా పిచ్చి మొక్కలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని జెసిబి సహాయంతో తొలగించి అదేవిధంగా బోరుబావికి మోటారు లేని సమస్యను గుర్తించి నూతన మోటార్ను తెప్పించి బిగించి వినియోగంలోకి తేవడం జరిగింది ఇట్టి విషయంలో చొరవ చూపి మూగజీవాల దాహార్తి తీర్చడానికి సేవా భావంతో ముందుకు వచ్చినటువంటి కోల శ్రీనివాస్ ను రైతులు, గ్రామ ప్రజలు అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఆర్ఐ కోల శ్రీనివాస్ మాట్లాడుతూ నా వంతుగా నా గ్రామానికి నాకు తోచినంత వరకు సహాయం చేయడంలో ముందుంటానని తెలియజేశారు.