పయనించే సూర్యుడు జూలై 5 (గణేష్, టౌన్ రిపోర్టర్ వేములవాడ :మూగజీవుల పట్ల కరుణ చూపండి శాఖాహారం, అహింసపై ప్రజల్లో చైతన్యంవేములవాడలో ఘనంగా జాతీయ అహింసా ధ్యాన మహాసభల ప్రచార ర్యాలీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ మరియు నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుండి 5 వరకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న జాతీయ అహింసా ధ్యాన మహాసభల పోస్టర్ ఆవిష్కరణ, ప్రచార కార్యక్రమం వేములవాడ పట్టణంలో ఘనంగా జరిగింది. లోక కల్యాణంలో భాగంగా ప్రపంచ శాఖాహార, అహింసా దినోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించనున్న ఈ మహాసభల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పట్టణంలో వాహనాలతో భారీ ప్రచార ర్యాలీని నిర్వహించారు. ముఖ్య రహదారుల గుండా సాగిన ఈ ర్యాలీలో నిర్వాహకులు, ధ్యాన నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ధ్యానంతోనే విశ్వశాంతి, అహింసతోనే మానవ ప్రగతి సాధ్యమ వుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శాఖాహారాన్ని స్వీకరించి, మూగజీవుల పట్ల కరుణ చూపాలని కోరారు. శ్వాస మీద ధ్యాస ఉంచుతూ నిత్యం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం సిద్ధిస్తుందని, జన్మ సార్థకమవుతుందని వివరించారు. అక్టోబర్లో జరిగే ఈ మహాసభల్లో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతో పాటు ప్రతిరోజూ 5 గంటల పాటు సామూహిక సంగీత నాద ధ్యానం, ప్రముఖ ఆధ్యాత్మిక, సినీ, రాజకీయ ప్రముఖుల సందేశాలు మరియు స్పిరిచువల్ బుక్ ఫెయిర్ ఉంటాయని తెలిపారు. ఈ ధ్యాన మహాసభలను విజయవంతం చేసేందుకు వేములవాడ పరిసర ప్రాంతాల ప్రజలు, ధ్యానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.