పయనించే సూర్యుడు న్యూస్ :మే 24,తల్లాడ రిపోర్టర్ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసే యత్నాలు చేస్తుంది అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, జిల్లా సినీయర్ నాయకులు తాతా భాస్కరరావు అన్నారు. కుర్ణవల్లి గ్రామం లో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ అధ్యక్షులు నల్లమోతు మోహన్ రావు అద్యక్షతన జరిగిన రైతు సదస్సులో బొంతు రాంబాబు, తాతా భాస్కర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో 44 ద్వారా రైతు డిస్కం పేరుతో మూడోవ డిస్కం ఏర్పాటు చేసి వ్యవసాయ విద్యుత్, తోపాటు ఇతర సబ్సిడీ విద్యుత్ సరఫరా విభాగాలను మూడో విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో చేర్చి భవిష్యత్తులో వ్యవసాయ ఉచిత విద్యుత్ ప్రభుత్వం కు భారం అవుతుందని ప్రచారం చేసి ఉచిత వ్యవసాయ విద్యుత్ కు మంగళం పాడే అవకాశం ఉంటుంది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అని అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే మూడో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు కు అనుమతి వేగం గా ఇచ్చింది అని అన్నారు. వ్యవసాయ విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ మరియు ట్రాన్స్ ఫార్మర్లకు స్మార్ట్ మీటర్ల పెట్టడం మూడోవ డిస్కం ప్రధాన ఉద్దేశం అన్నారు. మొత్తం విద్యుత్ పంపిణీ వ్యవస్థ నుంచి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పొందే వ్యవసాయ మోటార్లు, ఎత్తిపోతల పథకాలు, మీషన్ భగీరథ, ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉన్న ప్రతి సంస్థ, వ్యక్తులు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతారు అని అన్నారు. విద్యుత్ సంస్కరణలు కి వ్యతిరేకంగా రైతులు ఉద్యమ బాట పట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువులు పెట్రోల్ డీజిల్ ధరలు వ్యవసాయ రంగ ఉత్పత్తుల పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. భూ సమస్యలు పరిష్కారం కోసం రైతులు ఉద్యమం లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ నాయకులు శీలం సత్యనారాయణ రెడ్డి, మండల అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య, ఐనాల రామలింగేశ్వరరావు,కట్టా దుర్గయ్య, ఐలూరి రాంరెడ్డి, పేరసాని వెంకటేశ్వరరావు, దొబ్బల సురేష్, కొటి రెడ్డి , కృష్ణారెడ్డి, హనుమంతరావు, డొకుపర్తి రాంమూర్తి, కొమ్మినేని బాబు,గుర్రుల గోపాల కృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి, అప్పిరెడ్డి, ఐలూరి పెద్ద కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు