మృతుంజేశ్వర స్వామి టికెట్ల విషయంలో రగడ

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్02.06.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// స్థానిక శ్రీ అభీష్టత మృత్యుంజయశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న సేవా టికెట్ల విషయంలో రగడ నెలకొని ఉంది ఈ మేరకు సోమవారం చిలికి చిలికి గాలివానలా తయారైంది దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ అర్చకుల మధ్య సేవా టికెట్ల విషయంలో సందిగ్ధత నెలకొని ఉంది ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి 2025 వరకు ఆలయంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు టికెట్లు విషయంలో అర్చకులు అనుభవిస్తున్నారని అయితే దేవాదాయ శాఖ అధికారులు సేవ టికెట్లు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారని గ్రూప్ టెంపుల్స్ అధికారి రమణ తెలిపారు కాగా ఇప్పటికీ దేవస్థానం అర్చకులు భక్తుల నుంచి వివిధ సేవా టికెట్లకు సంబంధించిన రుసుమును నేరుగా వారి యొక్క ఫోన్ పే కు మళ్లించుకుంటున్నారని ఆయన ఆరోపించారు ఈ విధంగా చేయడం వల్ల దేవస్థానం నగదును ఎండోమెంట్కు నష్టం చేసేలా చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు అయితే తమకు జమీందారులు ఇచ్చిన ఇనాం భూమి 70 ఎకరాలు ఇప్పించాలని పలుమార్లు అధికారులకు విన్నవించామని జీవనోపాధితో కూడిన జీతం ఏర్పాటు చేసిన తర్వాత సేవా టిక్కెట్లు దేవాదాయ శాఖ అధికారులు తీసుకోవచ్చునని అర్చకులు మహేష్ స్వామి అన్నారు ఈ మేరకు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఆయన వివరించారు ఏది ఏమైనప్పటికీ ఆలయంలో జరుగుతున్న సేవా టికెట్ల విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు