మృత్యుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం

పయనించే సూర్యుడు, మే 21 2026, నాగర్ కర్నూల్ జిల్లా, లకల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల పరిధిలోని చేర్కూర్ గ్రామానికి చెందిన బుర్ర లక్ష్మయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న మొహరం( పీర్ల పండుగ )గ్రూప్ సభ్యులు బుధవారం ఉదయం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కనిపించారు. అనంతరం కుటుంబ సభ్యులకు 10,000/- పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎండి షకీల్, ఎండి మహబూబ్ పాషా(ఎండి కైలాబ్), ఎండి అల్లిలుద్దీన్, కేశమోని లాలయ్య, మల్కేడి భాష, రౌతు తిరుపతయ్య, గొడుగు రమేష్, ఎండి అఫ్జల్, పురుగుల రమేష్, కేశమోని జంగయ్య తదితరులు పాల్గొన్నారు.