మెగా DSC కాదు దగా DSC నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి కళ్యాణ్ భరత్

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మే 29.05.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజక వర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ,మాజీ మంత్రి పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు , వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య సూచలతో ఈ నెల 29 శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్టిసి బస్టాండ్ సమీపంలో ని డా"బిఆర్అంబెడ్కర్ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమం పెద్దఎత్తున జరుగుతుందని వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ తెలిపారు, కూటమి ప్రభుత్వం ప్రకటించిన దగా డీఎస్సీకి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు అని గత ఎన్నికల ప్రచారంలో ఇదే కూటమి ప్రభుత్వం 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తాం అని చెప్పి అధికారం చేపట్టాక కేవలం 16వేలు పోస్టులకు మాత్రమే సంతకం చేసి ఏడాది తర్వాత నిర్వహించారు. అవి కూడా నార్మలైజేషన్ నెల రోజులు జరిపారని. ఇందులో కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి అని. ప్రశ్నా పత్రాల లీకేజ్ జరిగిందిఅన్నారు వీటి అన్నిటి పైన సి బిఐతో విచారణ చెయ్యాలి అని తప్పుచేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు , ఈ నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగ మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు మరియు నిరుద్యోగులు పాల్గొని విజయవంతం చెయ్యలని కోరారు.ఈ సమావేశంలో చౌడేపల్లి పంచాయతీ అధ్యక్షులు నున్నా భాస్కర్,జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ నాగేంద్ర,గోవర్ధన్, నాగరాజ్, గణేష్,మండల సోషల్ మీడియా అధ్యక్షులు ప్రభు పాల్గొన్నారు.