మైతాపూర్ లో ఘనంగా పెద్దమ్మ తల్లి పండుగ లు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జూన్ 05 మామిడిపెల్లి లక్ష్మణ్ మైతాపూర్ గ్రామములో గురువారం రోజున గ్రామ దేవత అయిన పెద్దమ్మ తల్లి పండుగను గ్రామంలో ఉన్న అన్ని కులాలకు చెందిన కుల పెద్దలు అన్ని సంఘము ల అధ్వర్యం లో ఆయా సంఘాల అద్యక్ష కార్యదర్శుల సభ్యులు అందరూ కలిసి డప్పు చపులతొ గొర్రె పొట్టేళ్ళు తో గ్రామంలో ఉన్న పోరుమల్ల రోడ్డు లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించారు. దీనికంటే ముందు యాదవ సంఘం ఆధ్వర్యంలో పోయిన వారం రోజుల క్రితం కుమ్మరి పెళ్లి గ్రామంలో ఉన్న పెద్దమ్మా తల్లి వద్దకి వెళ్ళి అక్కడ మొక్కులు తీర్చుకొని వచ్చిన వారం రోజుల తరువాత మైతాపూర్ లో పెద్దమ్మ తల్లి పండుగ మరియు ఒక్కొక్క పండుగ లు అన్ని రకాల పండుగ లు జరుపుకుంటారు. గ్రామంలో అందరూ కలిసి కట్టుగా ఉండాలని పిల్ల పాపలు చల్లగా ఉండాలని వ్యవసాయ దారులకు పాడిపంట లు దినుసులు రైతులకు బాగా పండాలని పాడి పశువులు అభివృద్ధి చెందాలని ఇతర కులా వృత్తుల కూ ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని కోరారు. ప్రతి సంవత్సరం కుమ్మరి పెళ్లి పెద్దమ్మ తల్లి వద్దకు వెళ్లి యాదవ సంఘం వారు మొక్కులు చెల్లించుకో ని రావడం గతంలో నుండి వస్తున్న ఆచారం అని గ్రామంలో ఉన్న నాటి కాలం పెద్దమనుష్యులు అంటున్నారు.