మైతాఫూర్ లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు. డాక్టర్. సంజయ్ కుమార్.

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జులై 03 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండల పరిధిలోని మహితాపూర్ గ్రామ ములోని పాలడుగు స్వప్న అంజయ్య కు మంజూరైన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమంలో జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని వారి ఇంటిలో సత్యనారాయణ స్వామి వ్రతం కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి పూజ కార్యక్రమాలు పూర్తి చేసి ఇందిరమ్మ గృహ ప్రవేశ ము ప్రారంభం చేశారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు..అనంతరం వారికి చీరను బహుమతి ప్రదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహితాపూర్ గ్రామంలో ఇదివరకు 42 నలభై రెండు ఇందిరమ్మ గృహాలు మంజూరు కాగా 35 గృహాలు. నిర్మాణ పనులు ప్రారంభం చేసి అందులో నుండి 24 పూర్తి స్థాయిలో చివరి దశలో పనులు పూర్తి చేసి ప్రారంభ దశలో ఉన్నాయని ఇంకా పదకొండు గృహాలు వివిధ రకాల కారణాలు తో లబ్ధిదారులు వెనకబడిన వారంతా వెంటనే వారు పనులు మొదలు పెట్టుకొని వెంటనే పూర్తిచేయాలని వారందరినీ కోరారు. మహితాపూర్ గ్రామానికి ఇంకను రెండవ విడత కింద ఉన్న అర్హులు అయిన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న శాసన సభ్యులు సంజయ్ కుమార్ ని గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కోరుట్ల బస్టాండ్ వద్ద ఉన్న ఇందిరమ్మ విగ్రహం వరకు సిమెంట్ రోడ్డు మంజూరు చేయాలని మాజీ సర్పంచ్ గన్నే రాజారెడ్డి కోరారు. త్వరలోనే ఈ రోడ్డు మంజూరు చేస్తామని తెలిపారు..మైతాఫూర్ నుంచి జోగిన్ పల్లి మైతాఫూర్ నుంచి పోరుమల్ల వరకు డంభార్ రోడ్డు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో. మాజీ సర్పంచ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గన్నే రాజారెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ మాజీ ఎంపి పి ఉపాధ్యక్షులు కోల శ్రీనివాస్ మండల నాయకులు గుర్రం మహేందర్ గౌడ్. గంప ఆనందం. పాలడుగు గంగారెడ్డి మెంబర్ గంగారెడ్డి పాలడుగు ఎల్లయ్య మాజీ ఉపసర్పంచ్ రాగుల హనుమండ హనుమంత రెడ్డి పాలడుగు మల్లయ్య. తదితరులు పాల్గొన్నారు.