మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి

"సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్"

పయనించే సూర్యుడు రాజేష్ దౌల్తాబాద్) 12 రాయపోల్ కేంద్రంలో మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో బాలికపై జరిగిన అమానుష ఘటనను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేగంగా విచారించి నిందితుడికి చట్టప్రకారం అత్యంత కఠిన శిక్ష విధించాలని సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తానా ఉమర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖమ్మం జిల్లా తల్లంపాడు గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు గౌస్ పాషాపై పోలీసులు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ ఘటనలో బాలిక తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుండటం ఆందోళన కలిగించే విషయమని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చిన్నారుల భద్రత విషయంలో సమాజం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.ఇలాంటి అమానుష ఘటనలను మతాలు, కులాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని, మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు కఠిన చట్టాల అమలుతో పాటు వేగవంతమైన న్యాయ ప్రక్రియ అవసరమని ఆమె పేర్కొన్నారు.నిందితుడికి వెంటనే శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచారణ చేపట్టాలని, బాధిత బాలికకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.