మైనార్టీ బాలుర బోధన్ గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.

పయనించే సూర్యుడు న్యూస్ మే 20 బోధన్ : బోధన్ మైనార్టీ బాలుర రెసిడెన్షియల్ కళాశాలలో ప్రవేశ దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపల్ జావిద్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.ఎంపీసీ ఫస్టియర్ మరియు బైపీసీ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశం కొరకు వెనుకబడిన ముస్లిం మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ జావిద్ కోరారు.ఎంపీసీలో మైనార్టీ 30 నాన్ మైనార్టీ 10 మొత్తం 40 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుందన్నారు.అదేవిధంగా బైపీసీలో కూడా ఇదేవిధంగా సీట్లు కేటాయించడం జరిగిందన్నారు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంచే నాణ్యమైన విద్యను అందించడంతో పాటు పౌష్టికాహారంఅందిస్తామన్నారుపుస్తకాలు నోట్బుక్స్ కాస్మెటిక్స్ యూనిఫామ్ మరియు స్టేషనరీ ఉచితంగా ఇవ్వడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన ఆట మైదానం విశాలమైన తరగతి గదులలో బోధన పిఏపీసెట్ కొరకు ప్రత్యేక తరగతులునిర్వహించబడతయివివిధ రకాల పోటీ పరీక్షలపై అవగాహన కల్పించి తగిన విధంగా విద్యార్థులను సన్నద్ధం చేయడం మా ప్రత్యేకత అని ప్రిన్సిపల్ తెలిపారు. ఆక్టివిటీస్,ఆటల పోటీలు,వ్యాసరచన,వక్తృతవ పోటీలతో పాటు స్పార్క్ ఫాస్ట్ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. లిమిటెడ్ సీడ్స్ ఉన్నట్లు ప్రిన్సిపల్ వెల్లడించారు.ఆసక్తి కలవారు క్రింద ఉన్న ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు.8096117156,810 6636777.