02 Nov 2026 | 10:44 PM

మైసిగండిలో అభివృద్ధి పనులకు శ్రీకారం రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం

సర్పంచ్ ప్రేమా జవహర్ లాల్ నాయక్

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 02కడ్తాల్ మండల రిపోర్టార్ సురేందర్ గౌడ్ : గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మైసిగండి గ్రామ సర్పంచ్ ప్రేమ జవహర్ లాల్ నాయక్ అన్నారు.రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో హెచ్‌ఎండీఏ నిధులు రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ ప్రేమ జవహర్ లాల్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులకు శ్రీకారం చుట్టి నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.గ్రామంలో రహదారి సౌకర్యాలు మెరుగుపడితే ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తొలగడంతో పాటు గ్రామ అభివృద్ధికి మరింత దోహదపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపడతామని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ పరమేష్, ఉపసర్పంచ్ హిరసింగ్, వార్డు సభ్యులు సుమన్, యమున, దొలి, రవి, వినోద్, శారద, రాజు, కిషన్, పంచాయతీ కార్యదర్శి జంగయ్య తదితరులు పాల్గొన్నారు.