పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 13 :(సింగరేణి రిపోర్టర్ నరేష్) కారేపల్లి మండలంలోని గుంపలగూడెం గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో, గ్రామ శాఖ అధ్యక్షుడు భూక్య సైదులు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే గారికి రైతులు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. మొక్కజొన్న పంట విక్రయించిన రైతులకు ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో వ్యవసాయ పనులు సులభంగా కొనసాగించేందుకు అవకాశం కలిగిందని రైతులు పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షుడు భూక్య సైదులు మాట్లాడుతూ, రైతుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి సకాలంలో స్పందించడం అభినందనీయమని అన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా మొక్కజొన్న చెల్లింపులు విడుదల చేయడం పట్ల ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ధరావత్ వినోద్, భానోత్ అశోక్, భూక్య బాబురావు, ధరావత్ భాస్కర్, సీతారాములు, బానోత్ కిషన్, వాంకుడోత్ వస్రం, భూక్య సోమ్లా తదితరులు పాల్గొన్నారు. గ్రామ రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.