పయనించే సూర్యుడు జూన్ 6 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మండగిరి పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణములో డిల్ పి ఓ శ్రీమతి తిమ్మక్క పర్యవేక్షణలో మండగిరి గ్రామ ప్రజలు నాయకులు పాల్గొని మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమములో బిజెపి నాయకులు వెల్లాల మధుసూధనశర్మ ముఖ్య అతిథిగా హాజరై మొక్కులు నాటిన అనంతరం డిఎల్పీఓ తిమ్మక్క మరియు మధుసూదన శర్మ మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని పెంచడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తద్వారా భావితరాలకు సంపూర్ణమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని అందించవచ్ఛని మధుసూదన శర్మ తెలిపారు.కాబట్టి మొక్కలు నాటడం మొక్కుబొడిగా కాకుండా మండగిరి పంచాయతీ తరుపున నిధులను కేటాయించి లేదా మండగిరి పంచాయతీ పరిధిలో డబ్బులు ఉన్న సంపన్నుల ద్వారా నిధులను సేకరించి మంచి మంచి ఫలాను అందించే మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేయడం చేస్తే ప్రతి ఇంట్లో ఒక మొక్క శ్రద్ధగా పెంచే అవకాశం ఉంటుందని తద్వారా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పర్యావరణ పరిరక్షణ లక్ష్యాన్ని తొందరగా చేరుకోవచ్చని మధుసూదన శర్మ తెలిపారు.ఈ కార్యక్రమములో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసులు, హైస్కూల్ కమిటీ చైర్ పర్సన్ పార్వతమ్మ, లక్షుమన్న, నాగేష్,గాదిలింగప్ప, చిట్టెమ్మ ,మొదలైన వారు పాల్గొన్నారు.