పయనించే సూర్యుడు, జులై 03 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ విద్యార్ధులకు తెలియ చేయునది ఏమనగా ఆగస్టు 2026 సెషన్ కొరకు ఎన్సివీటి ప్యాటర్న్ క్రింద వివిధ ఇంజనీరింగ్ మరియు నాన్ - ఇంజనీరింగ్ ట్రేడ్ ల లో శిక్షణ పొందడానికి రాష్ట్రంలోని గవర్నమెంట్ ప్రైవేట్ ఐటిఐ లలో మరియు ఏటిసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ లలో ఉన్న మానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ టెక్నీషియస్, పర్చ్యువల్ ఎనాలిసిస్ అండ్ డిజైనర్ (ఎఫ్ ఈ ఎం) , సి.ఎన్.సి, మెషినింగ్ టెక్నీషియన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ మరియు ఇంజనీరింగ్ డిజైన్ టెక్నీషియన్ కోర్స్ లలో ఉన్న సీట్ల కొరకు అడ్మిషన్లు ఆన్లైన్లో https:// iti.telangana.gov.in వెబ్సైట్ లో నిజ ధృవపత్రాల ఆధారాలతో దరఖాస్తులు చేసుకోవాలని ఆర్ ఐ టి ఐ భద్రాచలం ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.