మొర్రిగుడ గ్రామం లో ఇల్లు స్థలం కేటాయించాలి.సిపిఎం పార్టీ డిమాండ్ చేశారు

పయనించే సూర్యుడు న్యూస్ తేదీ జూన్ 8 రూలర్ రిపోర్టర్ బాసు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండల కేంద్ర పరిధిలో మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతూ అరకు వేలి మండలం బస్కి పంచాయితీ మొర్రిగుడ గ్రామం లో 96 కుటుంబ లు నివశిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు స్థలం 2 సెంటు భూమి ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇల్లు స్థలం లేక కిల్లో అనిత భర్త నాగేశ్వరరావు పాంగి ఎలిశా, కిల్లో పూర్ణిమ్మ గిరిజన పేద కుటుంబం వారు జీవించేందుకు చాలా మానసిక ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ అధికారులు స్పందించి మొర్రిగుడ గ్రామంలో ఉన్నా ఇల్లు స్థలం సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ పర్యటనలో పెసా కమీటీ సభ్యులు కె.మార్కండ్, తాంగుల మొంగ్లు, కె.రాజు, కె.భీష్మ, కె.రాంబాబు, కొర్రా, జయరాం పాంగి సహదేవ్, పాంగి బలరాం తదితరులు పాల్గొన్నారు.