03 Nov 2026 | 12:56 AM

మోడల్ స్కూల్స్ సమస్యలు పరిష్కరించాలి: JAC నాలుగవ రోజు కొనసాగిన మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసనలు నడిగూడెంలో MPDO తహసీల్దార్‌లకు వినతిపత్రాలు అందజేత

పయనించే సూర్యడు డిసెంబర్ 02 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు మోడల్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమాలు నడిగూడెం మండల కేంద్రంలో నాలుగో రోజు కూడా హోరెత్తాయి. ఇందులో భాగంగా సోమవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ) కార్యాలయంలో మరియు మండల రెవెన్యూ అధికారి (తహసీల్దార్) కార్యాలయంలో సంబంధిత అధికారులకు ఉపాధ్యాయులు వినతిపత్రాలు సమర్పించారు. ​మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి తక్షణ పరిష్కారానికి తగిన సిఫారసులు చేయవలసిందిగా అధికారులను వారు కోరారు. ​ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కరివిరాల తెలంగాణ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల డిమాండ్లు నెరవేరే వరకు అందరూ ఐక్యంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ​ఇట్లు, మోడల్ స్కూల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC).