మౌలాలి లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్

పయనించే సూర్యడు / మే 25 / ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు ఉప్పల్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఆదివారం మౌలాలి 2బిహెచ్‌కే ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్ విశేషంగా సాగింది. ఈ వైద్య శిబిరాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా అందించడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నియోజకవర్గ ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ఈ క్యాంప్‌లో కంటి, దంత పరీక్షలు, ఫిజియోథెరపీ, హోమియోపతితో పాటు బీపీ, షుగర్, ఈసీజీ వంటి సాధారణ వైద్య పరీక్షలను వైద్యులు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోడులను పంపిణీ చేయడంతో పాటు, కంటి ముత్యబిందు శస్త్రచికిత్సలను కూడా ఉచితంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సినియర్ నాయకులు కరిపే ప్రవీణ్ వంజరి, ఎం. శ్రీదేవి, వెంకటేష్ గౌడ్, పీడబ్ల్యుటి చైర్మన్ చి. వరప్రసాద్, రెటినోవా ఫౌండేషన్ డైరెక్టర్ డి. సునీల్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.