మ్యాదరివాడలో అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

పయనించే సూర్యుడు జూన్ 9 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ ఉట్నూర్ ప్రతినిధి:-ఉట్నూర్ మండలంలోని మ్యాదరివాడ గ్రామంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణ పనులకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ భూమిపూజ నిర్వహించారు టెంకాయ కొట్టి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే, అభివృద్ధి పనులను త్వరితగతిన మరియు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి అధికార పార్టీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు ప్రతిపక్షాలు చేసే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉపసర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.