మ్యాన్ హోల్స్ నుండి వరద నీరుపొంగిన తీరుపై సమస్యను అధికారులకు తెలిపిన మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్

పయనించే సూర్యుడు, మే 28 రంగారెడ్డిజిల్లాప్రతినిధి ఎస్ఎంకుమార్ ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉష ముళ్ళమ్యాన్ హోల్స్ నుండి వరద నీరు పొంగి రోడ్డు మీద ప్రవహించడంతో ప్రజ లు ఇబ్బంది పడుతున్నారన్నపూడి ప్రధాన రహదారిలో ఎల్లమ్మ చెరువు పెట్రోల్ బంక్ వద్ద మ్యాన్ హోల్స్ నుండి వరద నీరు పొంగి రోడ్డు మీద ప్రవహించ డంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకున్న డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ సమస్య ను జల మండలి అధికారులతో కలిసి పరిశీలించ డం జరిగింది.ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఇక్కడ మ్యాన్ హోల్ పగిలిపోవడంతో నీరు రోడ్లపై ప్రవహిస్తుం దని, సమస్యను శేరిలింగంపల్లి శాసన సభ్యులు పి.ఎ.సి చైర్మన్ శ్రీ అరేకపూడి గాంధీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తు న్నామని తెలియచేసారు. ప్రధాన రహ దారి కావడంతో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా,ట్రాఫిక్ నిలిచి పోకుండా నివారణ చర్యలు చేపట్టి, వరద నీటి ప్రవాహాన్ని రోడ్డు పైకి రాకుం డా నివారి స్తున్నామని తెలిపారు. డామేజ్ అయిన మ్యాన్ హోల్ ని పునరుద్దరించి సమస్య ను పరిష్కరిస్తా మని హామీ ఇచ్చారు.ఈ కార్య క్రమంలో పోశెట్టిగౌడ్,ఇరిగేషన్ ఎ.ఇ సర్వేష్, వాటర్ వర్క్స్ సూపర్వై జర్ శివ తదితరులు పాల్గొన్నారు