పయనించే సూర్యుడు న్యూస్ జూలై 03 యడ్లపాడు మండల ప్రతినిధి.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎడ్లపాడు మండలం బోయపాలెం గ్రామంలోని 80వ బూత్ పరిధిలో ఎస్‌ఐఆర్ సర్వే కార్యక్రమం కొనసాగుతోంది. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ, అవసరమైన మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తూ సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 80వ బూత్ బీఎల్‌ఏ వంకదారి వెంకటేశ్వరరావు పాల్గొని ఓటర్లకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, అవసరమైన సవరణలు సకాలంలో పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఓటరు వివరాలను ధృవీకరించుకుని, ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కును పరిరక్షించుకునేలా ఎస్‌ఐఆర్ ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని కోరుతూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధులు పాల్గొని సర్వే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు…