యాడికిలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ

పయనించే సూర్యుడు న్యూస్ యాడికి జూన్ 6 మండల కేంద్రమైన యాడికిలో పర్యావరణ కార్యక్రమాన్ని అధికారులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ప్రతినిధులు, ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పది పండ్ల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో యాడికి ఎంపీడీవో వీరరాజు, ఈవోఆర్డీ శశికళ, పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్, వెలుగు ఏపీఎం చంద్రశేఖర్, గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు పరమేశ్వర్, సుమంత్, చిగురుపాటి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు 'మే ఐ హెల్ప్ యు' ఫౌండేషన్ అధ్యక్షుడు బండారు బాలకృష్ణ, రెయిన్బో ఎన్విరాన్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు కే. శారద, దివ్య ఎన్విరాన్మెంట్ సొసైటీ అధ్యక్షుడు బండారు ధనుంజయ, అమృత ఎన్విరాన్మెంట్ సొసైటీ అధ్యక్షుడు ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, కర్షిని ఎన్విరాన్మెంట్ సొసైటీ అధ్యక్షుడు కాయపాటి నరేష్ యాదవ్, మేఘన ఎన్విరాన్మెంట్ సొసైటీ అధ్యక్షుడు పటాన్ ఫరూక్ హాజరయ్యారు. ఈ పర్యావరణ పరిరక్షణ ముందడుగులో నాగలక్ష్మి, రామేశ్వరయ్య ఆచారి, రాఘవ ఆచారి, ఫాతిమా, శైలజ, సావిత్రి, రజియా తదితర ఎన్జీవో ప్రతినిధులతో పాటు స్థానిక గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.