యువకులు క్రీడలలో రాణించాలి

★ తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ - గోలి శ్రీనివాస్ రెడ్డి

పయనించే సూర్యుడు, మే 21 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల పరిధిలోని రాచూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రాచూరు ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో విజేతలకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి బహుమతులు ప్రధానం చేశారు. బుధవారం రాచూరు గ్రామంలో నిర్వహించిన రాచూరు ప్రీమియల్ లీగ్ టోర్నమెంట్ సందర్భంగా చివరి రోజు ఫైనల్ గేమ్ లో ఎస్ వి టీ గణేష్ ఫైటర్స్ టీంలు పోటాపోటీగా ఆటను కొనసాగించి గణేష్ ఫైటర్ టీం పై ఎస్ వి టీం విజయం సాధించింది. యువత క్రీడల్లో క్రమశిక్షణ తోపాటు, నాయకత్వ లక్షణాలతో క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాచూర్ గ్రామంలో గత వారం నుంచి నిర్వహించిన (ఆర్పిఎల్) క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా హాజరై గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోలి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ క్రీడలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కావని, యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి స్నేహభావాన్ని పెంపొందించే సాధనమన్నారు. ముఖ్యంగా క్రికెట్ ఆటలో గెలుపు, ఓటములు సహజమని, కానీ క్రీడాస్ఫూర్తి అత్యంత ముఖ్యమని అన్నారు. ప్రతి క్రీడాకారుడు గెలవాలనే లక్ష్యంతో ఆడాలని, అదే సమయంలో పరస్పర గౌరవం మరియు క్రమశిక్షణను పాటించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి టోర్నమెంట్‌లు మంచి అవకాశాలుగా నిలుస్తాయని పేర్కొంటూ, భవిష్యత్తులో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించాలని యువతకు ఆకాంక్షించారు. జిల్లాస్థాయి రాష్ట్రస్థాయిలో జాతీయ స్థాయిలో రాణించడానికి తగిన సహాయం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ టోర్నమెంట్లో మొదటి విజేతకు 35 వేల రూపాయలు మరియు షీల్డ్ ను తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, రెండవ బహుమతి 20వేల రూపాయలు మరియు ఫీల్డ్ సింగిల్ విండో డైరెక్టర్ నాగులు నాయక్ మూడవ బహుమతి 15వేల రూపాయలు మరియు షీల్డ్ వెల్దండ మండల వైస్ ఎంపీపీ అనిల్ కుమార్ ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్దండ మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుట్టా రామిరెడ్డి, జిల్లా నాయకులు నాగులు నాయక్, కల్వకుర్తి మాజీ ఎంపీపీ గోవర్ధన్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, కల్వకుర్తి మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సింగం విజయ్ గౌడ్, రాచూరు సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గణేష్, మాజీ సర్పంచ్ పవన్ కుమార్, మాజీ ఎంపీటీసీ వెంకటయ్య, తాజుదిన్, రాజు, రమేష్, నగేష్, వార్డు సభ్యులు నరేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.