యువతను విస్మరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

పయనించే సూర్యుడు: జూలై: 7/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మద్దోజు శ్రావణ్ కుమార్ స్థానిక సత్తుపల్లి పట్టణ కేంద్రంలో విశ్వశాంతి స్కూల్ నందు అఖిలభారత యువజన సమాఖ్య నియోజకవర్గ మహాసభ ఎస్కే పాషా అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మద్దోజూ శ్రావణ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను విస్మరించాయని ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను పక్కదోవ పట్టించారని కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకోవడంలో యువతని మోసం చేస్తుందని అన్నారు ఉద్యోగాల గురించి చెప్పకపోగా ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేయడానికి శ్రీకారం చుట్టి ఉద్యోగాలు యువతకి లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు యువతని మభ్యపెట్టడానికి మతం కులం అనే పేరు తోటి దేశంలో మత విద్వేషాలని రెచ్చగొడుతున్నారు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి 4000 ఇస్తామని చెప్పి ఇంతవరకి వాటి ఊసే లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది యువతని నెరవేర్యం చేయటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదమ్ముల వైఖరిని చూస్తున్నాం అందుకే ఈ మతోన్మాద శక్తికి ఈ మాటల గారెడికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం యువతకి ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో అఖిలభారత యువజన సమాఖ్య నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన కమిటీ అధ్యక్షులుగా నాగరాజు, కార్యదర్శిగా ఎస్కే పాషా ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ టౌన్ కార్యదర్శి నిమ్మటూరి రామకృష్ణ , రూరల్ మండల కార్యదర్శి తడికమల్ల యోబు , గాదె రవి, కంచ శ్రీను, వల్లూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు