రంగారెడ్డి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్

రెడ్డి ఎమ్మెల్యే గాంధీ ప్రసంగించారు

పయనించే సూర్యుడు,మే 23 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ కొంగర కలాన్ లోని రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యం(కలెక్టరేట్ కాంప్లెక్స్) సమావేశం మందిరంలో జరిగిన 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక రంగారెడ్డి జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ ,ఎమ్మె ల్సీ శ్రీ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే లు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి,,శ్రీ ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య, శ్రీ వీర్లపల్లి శం కర్, కసిరెడ్డి నారా యణ రెడ్డి,చైర్మన్లు కోదండారెడ్డి,శ్రీ చల్లా నర్సింహ రెడ్డిని మల్ రెడ్డి రామిరెడ్డి జగదీశ్వర్, కలెక్టర్ నారాయణ రెడ్డి అడిషనల్ కలెక్టర్లు శ్రీ చంద్రారెడ్డి కిరట్తణ్మయితో కలిసి పాల్గొన్న పిఏసి చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా పిఎస్సి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ…. ప్రతి పేద కుటుంబా నికి సంక్షేమ పథకాలు అందివ్వడమే ప్రభుత్వ లక్ష్యం అని, ఎలాంటి తారత మ్యాలు లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరగాలని , ప్రతి పేదవాడికి సంక్షేమ పథకం అందేలా అధికారులు కృషి చేయాలని, పేదవారు కన్న కల ఇంది రమ్మ ఇల్లు అని,పేదవారికి భారం కాకుం డా ప్రభుత్వం అన్ని రకా ల నిర్ణయాలు తీసుకుంటుంది. పేదవారి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది అని,అర్హు లైన ,నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ మరియు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు కొరకు అర్హులై న లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ప్రతి ఒక్కరికి అందేలా చూడలని పీఏసీ చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండు సంవత్సరాల మూడునెలలు పూర్తయ్యింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ, సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీపడకుండా మన ప్రభుత్వం పని చేస్తోంది. మేం పాలకులం కాదు… సేవకులం అన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటున్నాం అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు… ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నది మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే "ప్రజాపాలన - ప్రగతిప్ర ణాళిక" పేరుతో కార్యక్రమాన్ని ప్రారం భించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థా యి వరకు, అన్ని శాఖల సమన్వయం తో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగాలి. ఊరు, వాడ సమస్యల పరి ష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పని చేయాలి. వేగంగా ఫైళ్ల క్లియరెన్స్, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని ఉద్దేశ్యంతో కార్యక్రమంను ఏర్పాటు చేయడం జరిగినది అని పిఎసి చైర్మన్ గాంధీ అన్నారు.

మహాలక్ష్మి… ఉచిత బస్సుసౌకర్యం, ₹500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇ ళ్ళు, మహిళా సాధికారత వంటి పథ కాలు అర్హులకు చేరేలా చూడలని ఇది మన అందరి బాధ్యత అన పిఏసి చైర్మన్ గాంధీ తెలియచేసారు.

"తెలంగాణ రైజింగ్ – 2047" విజన్


తో ఆర్థికంగానే కాక, అన్నీ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి.ప్యూర్, రేర్ గా రాష్ట్రాన్ని వర్గీక రించుకున్నాం. వాటి పరిధిలో సేవా, తయారీ, వ్యవసాయ రంగాల్లో ప్రపం చానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధా రణ కార్యక్రమం కాదు ఒక దీక్ష. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై… దేశా నికి, ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆశయం అనిప్రతి ఒక్కరు బాగస్వా మ్యులు కావాలని పీఏసీ చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మార్గద ర్శకంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేల కృషి చేస్తాం అని పిఎసి చైర్మన్ గాంధీ అన్నా రు.శేరిలింగంపల్లి నియోజక వర్గం ఒక మినీ ఇండియా అని,అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే లాచూస్తామని,మహిళల కోసం త్వరలో నే ఎల్లమ్మబండలో మహిళ పెట్రల్ బంక్ ను ఏర్పాటు చేయబోతున్నామని, మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని ,మహిళ భవనం నిర్మించుకుంటా మని, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా ప్రతి ఒక్కరు బాగస్వా మ్యం కావాలని,అ ధికారులు క్షేత్రస్థా యిలో పనిచేసి అభి వృద్ధి ఫలాలు ప్రజలం దరికి అందేలా చూడలని
పీఏసీ చైర్మన్ గాంధీ తెలియ చేసా రు.శేరిలింగంపల్లి నియోజక వర్గం ను అన్ని రంగాలలో శరవేగంగా అభి వృద్ధి చేసుకుంటు న్నామని,అన్ని ర కాల మౌలిక వసతు లకు పెద్ద పీట వేస్తున్నామని, ట్రాఫిక్ రహిత సమాజం కోసం ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామని,రోడ్ల విస్తరణ చేపడు తున్నామని, అన్ని రంగాలలో నియోజవర్గంను అభివృద్ధి చేస్తున్నామని ప్రతి ఒక్కరు బాగస్వా మ్యం కావాలని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, నాయకులు ,కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.