పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 6 చింతూరు మండలం నిమ్మలగూడెం గ్రామంలో వేగితోట రేషన్ షాప్‌ను ఘనంగా ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కాలుష్య కారక వాహనాల వినియోగాన్ని తగ్గించి సైకిల్/ఈ-సైకిల్ ఉపయోగించాలి అని పిలుపు మేరకు యం ఎల్ ఏ మిర్యాల శిరీష భాస్కర్ ఆదేశాలతో నిమ్మలగూడెం పార్టీ క్యాంప్ కార్యాలయం నుండి రేషన్ షాప్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సమష్టి బాధ్యత అని, కాలుష్యాన్ని తగ్గించేందుకు సైకిల్ మరియు ఈ-సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం రేషన్ షాప్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు. ఈ కార్యక్రమంలో చింతూరు మండల అధ్యక్షులు ఎం.డి. జమాల్ ఖాన్, క్లస్టర్ ఇన్‌చార్జ్ ఓ బిళ్ళనేని నరసింహరావు, కార్యదర్శి మల్లెల వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ సభ్యులు పసుపులేటి సల్మాన్ రాజు, కో క్లస్టర్ పోదిలి రామారావు, బీసీ సెల్ అధ్యక్షులు ముత్యాల శ్రీరామ్ మూర్తి, మాజీ సర్పంచ్ సోడే శ్రీను తదితర గ్రామ నాయకులు పాల్గొన్నారు.