రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి

★ నాగేపల్లి ఉప సర్పంచ్ యాసం సతీష్

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీకాలనీ-31 ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రామగిరి మండల నాగేపల్లి గ్రామ ఉప సర్పంచ్ యాసం సతీష్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదిన సందర్భంగా నాగేపల్లి ఉపసర్పంచ్, యాసం సతీష్ రక్తదానం చేసి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా యాసం సతీష్ మాట్లాడుతూ,రక్తదానం మహాదానం అని, ఒకరి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్త దానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు.మంత్రి శ్రీధర్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ రక్తదాన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.