పయనించే సూర్యుడు జూన్ 02, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళా శేఖర్: హైదరాబాద్ రవీంద్ర భారతి వేదికగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం వంగ శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్టీసి కండక్టర్ ఉద్యగ పదవీ విరమణ పొందిన అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పూర్వ సలహాదారులు కె.వి. రమణాచారి, ప్రముఖ పారిశ్రామిక వేత్త సారేపల్లి కొండల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంచు లింగన్న , రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విజయశ్రీ , రాష్ట్ర మహిళా కార్యదర్శి కవిత , రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు సునీత తో పాటు సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్.సి.ఎం. రాజు, లంక లక్ష్మీనారాయణ , విద్యానందా చారి, తదితర ప్రముఖులు పాల్గొని వంగ శ్రీనివాస్ గౌడ్ పుట్టినరోజు న కేక్ కట్ చేసి ఘనంగా సత్కరించారు.ఈ వేడుకలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి భారీ సంఖ్యలో జానపద కళాకారులు తరలివచ్చి తమ ప్రదర్శనలతో రవీంద్ర భారతిని కళాత్మకం చేస ప్రముఖులను ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ జిల్లా జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు టంకర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎదిర నర్సిములు, ఉపాధ్యక్షులు టి.బాలస్వామి, జానపద కళాకారుల సంఘం జడ్చర్ల నియోజక వర్గ ఇన్చార్జి కళాశేఖర్ , హన్వాడ మండల అధ్యక్షులు మునిమోక్షం రాజు, చెన్నకేశవులు, గోపి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసి, తమ కళారూపాలతో వేడుకను విజయవంతం చేసిన కళాకారులందరికీ వంగ శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.