రాజోలులో ప్రజాదర్బార్‌కు మంచి స్పందన

పయనించు సూర్యుడు జూలై 8 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) పొదలాడ రాజోలు నియోజకవర్గం పొదలాడలోని శుభం గ్రాండ్‌లో ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు, నాయకులు, కార్యకర్తల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు ,రాజోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భూపతిరాజు సాయిబాబు రాజు, పి. గన్నవరం నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనందసాగర్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, రాజోలు నియోజకవర్గ పరిశీలకులు పెచ్చెట్టి బాబు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.