రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని కలిసి సన్మానించిన కొడిదల రాము

నాగర్ కర్నూల్ యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు కొడిదల రాము

పయనించే సూర్యుడు మే 21 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ ఈరోజు హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంపీ రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి ను నాగర్‌కర్నూల్ జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కొడిదల రాము మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లాకు సంబంధించిన పలు స్థానిక, రాజకీయ అంశాలతో పాటు యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించినట్లు సమాచారం. జిల్లాలో పార్టీ బలోపేతం, యువతకు అవకాశాలు కల్పించడం వంటి విషయాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నట్లు కొడిదేల రాము తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మొలగర తిరుమలేష్ కార్యకర్తలు పాల్గొన్నారు.