02 Nov 2026 | 10:37 PM

రాజ్యాంగంలోని చట్టాలను తెలుసుకోవాలి.

పయనించే సూర్యుడు 3-11-2026 మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నామస్మరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సామాజిక సేవా కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు,మండల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొని అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గొల్లపెల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దిగంబరం, కానిస్టేబుల్ లు రవి, లింగంపల్లి తిరుపతి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంత వారు బీ.ఆర్.అంబేద్కర్ దేశాని కి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.దేశంలోని పేద,బడుగు,బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కచ్చితంగా ఉండాలని, రాజ్యాంగ ముసాయిదాలో చేర్చిన వ్యక్తి అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఆర్థికంగా,రాజకీయంగా సామాజికంగా, స్వేచ్ఛగా రాజ్యాంగ ఫలాలు అందుకునేలా తీర్చిదిద్దారన్నారు.విద్యా, వైద్యం, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టే చాలా మంది అభివృద్ధి ఫలాలు అందుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే ఈ రోజు కీ చాలా మందికి రాజ్యాంగ ఫలాలను అందటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు రాజ్యాంగంలోని చట్టాలను తెలుసుకొని,వాటి ప్రకారం నడుచుకోవాలని సూచించారు
సామాజిక సేవా కార్యకర్తలు గంగాధర మధుసూదన్, సాతల్ల లక్ష్మణ్, సిరికొండ తిరుపతి, వేల్పుల రాజేష్, మారంపెల్లి రఘు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గొల్లపెల్లి మండల నాయకులు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చెవుల మద్ది రమేష్,గోవిందు పల్లె సర్పంచ్ వినాయక స్వామి, 5వ వార్డు సభ్యులు సంగేమ్ కళ్యాణ్ లక్ పత్తి రెడ్డి, చీపెల్లి పోచయ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.