పయనించే సూర్యుడు న్యూస్ జులై 5 కోరుట్ల టౌన్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జులై 5వ తేదీన భువనగిరి జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజి గ్రౌండ్ లో నిర్వహించబోతున్న రాజ్యాధికార సమరభేరి సభను దోపిడీ పాలకుల గద్దెలు కదిలేలా విజయవంతం చేద్దామని టీఆర్పీ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు ఎన్నం రాజశేఖర్ పిలుపునిచ్చారు, ఈ సందర్భంగా ఎన్నం రాజశేఖర్ మాట్లాడుతూ రాజ్యాధికారమే మన భవిష్యత్తుకు ఏకైక మార్గం. మెజారిటీగా ఉన్న మనమే పాలకులం కావాలి.BC, SC, ST, మైనారిటీ బడుగు బలహీన వర్గాల ప్రజల్లారా, తల్లులారా, చెల్లెమ్మలారా, యువతీ యువకులారా, ఉద్యోగులారా.. అందరూ జులై 5న జరిగే రాజ్యాధికార సమరభేరి సభకు స్వచ్ఛందంగా,వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు