పయనించే సూర్యుడు న్యూస్ : పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-21 పగలంతా విద్యుత్ మరమ్మత్తుల పేరిట అంతరాయం రాత్రి ఎప్పుడు కరెంటు పోతుందో వస్తుందో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండల ప్రజలు.రామగిరి మండలంలో తరచూ విద్యుత్ అంతరాయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి సీనియర్ నాయకులు మొలుమూరి శ్రీనివాస్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మనమత్తుల పేరిట కరెంటు తీసివేయడం,రాత్రి సమయంలో గంటల తరబడి కరెంటు పోతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని కరెంటు ఎప్పుడు వస్తుందో కూడా సరైన సమాచారం ఇవ్వకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుకున్నారన్నారు.మండుతున్న ఎండల్లో విద్యుత్ లేక ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని,విద్యుత్ సమస్యలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం సూచనియమన్నారు. వెంటనే విద్యుత్ సరఫరాను స్థిరీకరించి, ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని అన్నారు. లేకపోతే ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో తీగల శ్రీధర్, ఆసం తిరుపతి, వరంకుషా, శ్రీనివాస చారి, దొంతుల సురేష్, గుండం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.