రామగుండం-1 ఏరియా తోటమాలి కాంట్రాక్టు కార్మికులకు రెగ్యులర్గా పని కల్పించాలి.

★ ఏ వెంకన్న ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ప్రదాన కార్యదర్శి

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీ కాలనీ -21 ఐఎఫ్టియు ఆధ్వర్యంలో రామగుండం-1 ఏరియాలో తోటమాలి కార్మికుల సమస్యల పైన ధర్నా నిర్వహించి వినతి పత్రం అందించిన ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న.ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టీ యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ…సింగరేణి యాజమాన్యం అధికారుల మధ్య సమనమయం లోపం వల్ల టెండర్ పిలిచే విధానంలో కండిషన్స్ సరిగా లేవని కొంతమంది కాంట్రాక్టర్స్ కోర్టుకు వెళ్లి ఈ టెండర్ను ఫైనల్ చేయకుండా అడ్డుపడడం జరిగిందని అదేవిధంగా కోర్టు తీర్పు వచ్చేంతవరకు ఈ కార్మికులకు ఉపాధి కల్పించకుండా అధికారులు సమన్వయం లోపం వల్ల రోజు తప్పి రోజు డ్యూటీ కి అనుమతిస్తూ ఇట్టి డ్యూటీకి గ్యారెంటీ లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్( ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో ఆర్జీవన్ జిఎం ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కార్మికుల యొక్క డిమాండ్ పత్రాన్ని డీజీఎం ఫారెస్ట్ భానోత్ కర్ణ కి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) రాష్ట్ర ఉపాధ్యక్షులు బి అశోక్, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు ఐ రాజేశం, డి బుచ్చమ్మ ,ఎం దుర్గయ్య, ఐలయ్య, మల్లికార్జున్, శంకర్, కవిత, మంజుల, రాజేశ్వరి, లక్ష్మి, ఆర్ లక్ష్మి, స్వరూప, పి వినోద, రమ. తదితరులు పాల్గొన్నారు.