రామచంద్రాపురంలో ఘనంగా వంగవీటి రంగ జయంతి వేడుకలు..

★ పూలమాలలు వేసి నివాళులర్పించిన వీరాభిమాని సూదా నరసింహారావు.. ★ పలు పార్టీల నాయకులు, కాపు సంఘం నాయకులు హాజరు..

పయనించే సూర్యుడు న్యూస్ :జూలై 6, తల్లాడ రిపోర్టర్ బాబురావు బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, కాపు సంఘం నాయకులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 79వ జయంతి వేడుకలను శనివారం తల్లాడ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. వంగవీటి రంగా వీరాభిమాని, ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూదా నరసింహారావు ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న రంగా విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బెజవాడ బెబ్బిలిగా , ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం రంగా అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. సుదీర్ఘ కాలంగా ఆ మహానేతను ప్రజలు గుర్తుంచుకుంటున్నారంటే ఆయన చేసిన పోరాటాలు ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయని అన్నారు. అటువంటి నేతను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలు, పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పొదిల రవికుమార్, ఆకుల గాంధీ, కొత్త సీతారాములు, తాళ్లూరి హనుమంతరావు, పసుపులేటి దేవేందర్, శీలంశెట్టి వీరభద్రం, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వారు కూడా రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నేతలు పాల్గొన్నారు.

.