రామాపురంలో ఆంజనేయ స్వామి ఆలయానికి దాతల భారీ విరాళం

పయనించే సూర్యడు జూన్ 04 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ​సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. తిప్పిరెడ్డి బసిరెడ్డి జ్ఞాపకార్థం, వారి కుటుంబ సభ్యులు సుమారు రూ. 3 లక్షల వ్యయంతో ఆలయానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చారు.

.

​అందించిన సౌకర్యాలు:


తిప్పిరెడ్డి బసిరెడ్డి సతీమణి కాంతమ్మ, కుమారుడు వీరారెడ్డి, కుమార్తె పుష్పావతిల ఆర్థిక సహకారంతో ఆలయ ప్రాంగణంలో:
​రేకుల షెడ్డు నిర్మాణం ​గర్భగుడికి నూతన గేటు ​వాటర్ ట్యాంకు మరియు మోటారు ఏర్పాటు ​భక్తుల కోసం బల్లలు (బెంచీలు) తదితర సౌకర్యాలను కల్పించారు.

​దాతలను అభినందించిన గ్రామ ప్రముఖులు:


నిస్వార్థంగా ఆలయ అభివృద్ధికి కృషి చేసిన దాతలను స్థానిక సర్పంచ్ బూతుకూరు వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ మందుల నాగార్జున్, సీనియర్ జర్నలిస్ట్ ఏనుగుల వీరాంజనేయులు ప్రత్యేకంగా అభినందించారు. ​ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తిప్పిరెడ్డి హనుమారెడ్డి, సింగారెడ్డి శేషిరెడ్డి, గురువా రెడ్డి, మోహన్ రెడ్డి, పుల్లారెడ్డి, చిన్న కోటిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటప్ప రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొని దాతలను అభినందించారు.