పయనించే సూర్యడు జూలై 06 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు రామాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ మొదటి సర్పంచ్, కీర్తిశేషులు బూతుకూరి లచ్చిరెడ్డి సతీమణి (ప్రస్తుత గ్రామ సర్పంచ్ బూతుకూరి వెంకట్ రెడ్డి మాతృమూర్తి) అకాల మరణం చెందడం పట్ల స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా రామాపురం చేరుకుని, బూతుకూరి వెంకట్ రెడ్డి ని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరణించిన లచ్చిరెడ్డి సతీమణి పార్థివదేహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారికి ధైర్యం చెప్పారు.
.
నివాళులర్పించిన ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, కోదాడ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతమ్మ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కా బిక్షపతి, సింగిల్ విండో చైర్మన్ కొల్లు రామారావు, మాజీ చైర్మన్ సురేష్ ప్రసాద్, మాజీ జెడ్పిటిసి బాణాల కవితలతో పాటు పలువురు స్థానిక సర్పంచులు, మాజీ సర్పంచులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
.
రాజకీయాలకు అతీతంగా నివాళి
పార్టీలకతీతంగా జరిగిన ఈ సంతాప కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పాల్గొని తమ నివాళులర్పించారు. వారిలో రత్నవరం గ్రామ శాఖ అధ్యక్షుడు పోలంపల్లి వెంకటేశ్వర్లు, మండల నాయకులు కాసాని శ్రీనివాసరావు, జలీల్ మరియు ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు.