రాయలసీమ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా , జగన్ కు సవాల్ విసిరిన

పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ , మరియు టిడిపి నాయకులు.

పయనించే సూర్యుడు జులై 5 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయామ్ లో రాయలసీమలో జరిగినటువంటి అభివృద్ధి గురించి అలాగే 2019 - 24 మధ్య జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ వైసీపీ అధినేత జగన్మోహనారెడ్డికి సవాల్ విసిరారు. ఈరోజు వారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కర్నూలు నందు పార్టీ నాయకులు ఆకుపోగు ప్రభాకర్ కైపా పద్మలత రెడ్డి వై నాగేశ్వరరావు యాదవ్ మీన్నప్ప గార్లతో కలిసి ఏర్పాటుచేసిన పత్రిక మీడియా ప్రతినిధుల సమావేశంలో వారు మాట్లాడటం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చినది మొదలుకొని రెండు సంవత్సరాల కాలంలో రాయలసీమ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిందని రాయలసీమ జిల్లాలలోని ప్రతి జిల్లాకు కూడా ఏదో ఒక రకంగా పారిశ్రామికంగా అభివృద్ధి పరచాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రివ నారా లోకేష్ అనుక్షణం పాటుపడుతున్నారని, ఇందులో భాగంగా నిన్నటి దినము కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి గ్రామం నందు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీకి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని రానున్న రెండు సంవత్సరాల కాలంలో ఈ ఫ్యాక్టరీలో ఉక్క తయారుకానుందని, ఇందులో వేలాదిమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని తెలియజేస్తూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు పర్యాయాలు శంకుస్థాపనలు చేసి మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తానని ఐదు సంవత్సరాల జగన్ పాలనలో కనీసం ఒక అంగుళం కూడా అభివృద్ధి చేయలేదని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పరిశ్రమము పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తు చేశారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండు విడతల్లో ఈ ఫ్యాక్టరీని పూర్తి చేసేందుకు మొదటి విడతగా 4500 కోట్లు రెండవ విడతగా 11850 కోట్లు హెచ్చించి ఈ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలియజేశారు.00 పర్యావరణానికి అనుకూలంగా స్టీల్ ఫ్యాక్టరీ దక్షిణ భారతదేశంలోనే తక్కువ కార్బన్ ఉత్పాదకత కలిగిన సామర్థ్యంతో ఉత్పత్తి చేయడం జరుగుతుందని తెలిపార్. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీని పూర్తి చేస్తాను యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని గొప్పగా చెప్పారు కానీ చేసింది శూన్యం అదే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారము ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పనులను పూర్తి చేసేందుకు సిద్ధపడ్డారని తెలియజేశారు. రాయలసీమ అంటే కరువు కాటకాలకు నిలయంగా ఉన్నట్లు గమనించిన చంద్రబాబు నాయుడు రాయలసీమ అభివృద్ధికై సాగు తాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపుగా 120484 కోట్లు రక్షించారని 2026 27 బడ్జెట్లో పదివేల కోట్లు కేటాయించారని రాయలసీమ ప్రాంతంలోని తుంగభద్ర గోరకల్లు శ్రీశైలం ఇతర సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులపై 610 కోట్లు కేటాయించడం జరిగిందని హంద్రీనీవా విస్తరణ కోసం 3873 కోట్లు ఖర్చు చేసి రాయలసీమ చివరి ఆయకట్టు భూములకు నిరంధించిన ఘనత చంద్రబాబు నాయుడు దేనని మాట తప్పము మడిమతిప్పను అని గొప్పగా చెప్పుకునే వైఎస్ఆర్సిపి వారు రాయలసీమ ప్రాంత అభివృద్ధికి చేసిందేమిటో వారు కనీసం రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ కి ప్రహరీ గోడ కూడా నిర్మించలేకపోయారు విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలోని పూర్వకలను పారిశ్రామిక హక్కుగా అలాగే అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ పరిశ్రమను తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ ను తీసుకొని వచ్చిన ఘనత వారిదని, త్వరలో కర్నూలు జిల్లాకు హైకోర్టు బెంచ్ రానున్నదని తెలియజేశారు. గత వైసిపి ప్రభుత్వం హయాంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు తట్టుకోలేక రాయలసీమ ప్రాంతంలోని ఎన్నో పరిశ్రమలు పరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఇందులో అమర్ రాజా వంటి పరిశ్రమలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధిని చూసి మతిస్థిమితం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకరకంగా ప్రజలలో కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయాలని రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు తాను అధికారంలోకి వచ్చిన తక్షణమే అమరావతిలో నిర్మించబడినటువంటి ప్రజావేదికను కూల్చివేతతో తన దుష్ట పాలనను మొదలుపెట్టాడు అమరావతి రాజధానిని విస్మరించి రాజధానికి భూములు ఇచ్చిన రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేయడమే కాక మూడు రాజధానులు అంటూ కొత్త నాటకానికి తెర తీశారు విశాఖపట్నం అమరావతి కర్నూలు రాజధానులు అంటూ తన సహజ నైజాన్ని బయట పెట్టుకున్నాడు తరువాత అమరావతి రాజధానికి కూటమి ప్రభుత్వము కట్టుబడి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడంతో దిక్కుతోచని జగన్మోహన్ రెడ్డి మరల మావిగన్ కొత్త నాటకం మొదలు పెట్టాడు. తర్వాత అమరావతి రాజధాని పరిరక్షణ పేరుతో అమరావతిపై తన రౌడీ మూకలను ఉసిగొలిపి దాడిలకు పాల్పడేందుకు కుట్రలు చేశాడు అది విడిసి కొట్టడంతో మరల విజయవాడ ఆంధ్ర రాజధాని అంటూ మరోమారు తన నైజత్వాన్ని బయట పెట్టుకున్నారు ఇలా ప్రతిసారి అమరావతి రాజధానిపై విషం చిమ్ముతున్న జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతము కూటమి ప్రభుత్వం హయాంలో అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి నిర్మాణపు పనులను చూసి ఓర్వలేక ఇలా మానసిక రుగ్మతతో రోజుకు ఒక రాజధాని పేరు చెబుతూ రాబోయే ఎన్నికలలో మావిగన్ రాజధాని అంటూ ఎన్నికలకు సిద్ధమవుతానని చెప్పారు మేము జగన్లా కాకుండా 2014లో అమరావతి రాజధాని అన్నాం 2019లో 2024లో అమరావతి కే కట్టుబడి నిర్మాణము పనులను కొనసాగిస్తున్నాము రానున్న 2029 ఎన్నికల్లో కూడా అమరావతి రాజధాని నినాదంతోనే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతిని ఇది చంద్రబాబు నాయుడు తీసుకున్న దృశకల్పమని దానిని పార్టీ ఆన్నివేల సమర్థిస్తూ ముందుకు వెళతామని ఇందుకు రాష్ట్ర ప్రజల సంపూర్ణ సహకారం కూడా అవసరమని వారు విన్నవిస్తూ, వైసిపి నాయకులు కాలయాపన కోసం కబుర్లు చెప్పడం కాకుండా రాష్ట్ర ప్రజల కోసం ఏదైనా ఉపయోగపడే సలహాలు సూచనలు ఉంటే ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చౌకబారు కార్యక్రమాలు మాటలతో ఉన్న 11 సీట్లను కూడా పోగొట్టుకోకుండా కాపాడుకోవాలని సూచించారు.

.

(గుడిసె ఆది కృష్ణమ్మ)
తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షురాలు కర్నూల్.