రాయికల్‌లో ఘనంగా ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్, జూన్ 05 మామిడిపల్లి లక్ష్మణ్ రాయికల్ మున్సిపల్ పరిధిలోని 2, 3 వార్డుల్లో గురువారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులకు చీరలను పంపిణీ చేశారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘ సభ్యులకు ఇందిరమ్మ చీరలను అందజేశారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ భూక్య రాకేష్ నాయక్, మున్సిపల్ మేనేజర్ వెంకటి, వార్డుల ఇన్‌చార్జులు నరేష్, రాజ్‌కుమార్, మెప్మా ఆర్పీలు గాజంగి అనిత, తీగుళ్ల జయసుధ, అంగన్వాడీ టీచర్ సుజాత, మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.