రాయితీపై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా

పయనించే సూర్యుడు : రిపోర్టర్ శ్రవణ్ రాజ్ అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం లో 31.5.2026 ఈ ఖరీఫ్ సీజన్ కు గాను మండలంలో ఉన్నటువంటి 13 రైతు సేవా కేంద్రాలలో 50% రాయితీపై సరఫరా చేసేందుకు పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. మండలానికి జనుము 20.5 క్వింటాళ్లు, జీలుగ 30 క్వింటాళ్లు' పిల్లి పెసర 3.44 క్వింటాళ్లు రావడం జరిగింది. జనుము(10 కేజీలు) - 770/-, జీలుగ(10 కేజీలు) - 800/-, పిల్లి పెసర(8 కేజీలు) - 784/- చెల్లించి రైతులు తీసుకోవచ్చు. పచ్చిరొట్ట విత్తనాలు కావలసిన రైతులు, వారి యొక్క ఆధార్ మరియు భూమి వివరాలను తీసుకొని సంబంధిత రైతు సేవా కేంద్రాలలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ/ ఉద్యాన సహాయకులను సంప్రదించి డి కృషి యాప్ ద్వారా నమోదు చేసుకుని విత్తనాలు తీసుకోవచ్చు. తొలకరి వర్షాన్ని ఉపయోగించి ఈ పచ్చి రొట్ట పంటలను సాగు చేయడం వలన భూమిలో ఉన్నటువంటి సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుకోవచ్చు అలాగే వీటిని వేసుకోవడం ద్వారా రసాయన ఎరువులపై పెట్టేటువంటి ఖర్చులను కొంతవరకు రైతులు తగ్గించుకోవచ్చు. ఈ పచ్చి రొట్ట విత్తనాలతో పాటు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఇచ్చేటువంటి కొన్ని రకాల విత్తనాలను కలిపి రైతులు జల్లుకోవడం నేల గుల్ల మారడమే కాకుండా సారవంతాన్ని పెంపొందించవచ్చు. మండల వ్యవసాయ అధికారి తెలియ జేశారు