రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన కడప జిల్లా బాక్సింగ్ క్రీడాకారులు

పయనించే సూర్యుడు న్యూస్: కడప జూన్ 8: ఈరోజు కడప స్థానిక మునిసిపల్ స్టేడియం లో బాక్సింగ్ సబ్ జూనియర్ బాలబాలికల ఎంపికలు అట్టహాసముగా జరిగినవి ఈ ఎంపికలు బాక్సింగ్ జిల్లా అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగినవి ఈ ఎంపికలకు జిల్లా నుంచి బాలబాలికలు 50 మంది దాకా హాజరైనారు ఎంపికైన బాలబాలికలు ఈనెల 12 నుంచి 14 వరకు విజయనగరం జిల్లా నందు రాష్ట్ర స్థాయి పోటీలకు కడప జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారు ఏ పోటీలకు ముఖ్యఅతిథిగా గౌస్ భాషా డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ విచ్చేసి ఎంపికైన బాలి బాలికలను అభినందించారు అసోసియేషన్ కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపికైన బాల బాలికలు జిల్లాకు మెడల్స్ సాధించవలసిందిగా కోరారు
ఈ పోటీలకు రెఫరీగా ఆంజనేయులు వ్యవహరించారు అలాగే ఈ పోటీలకు అసోసియేషన్ అధ్యక్షలు వెంకటేష్ కొన్నిపాటి హాజరై రాష్ట్ర స్థాయికి వెళ్ళు క్రీడాకారులను అభినందించారు

.

విజయం సాధించిన క్రీడాకారుల వివరములు బాలురు :


40-43 కేటగిరి జి. చరణ్ సాయి
43-46 కేటగిరీలో కే. కార్తీక్
49-52 క్యాటగిరిలో సి. రెడ్డి మోనిష్ రావు
52-55 కేటగిరీలో సయ్యద్ ఇమాన్ హుస్సేన్
55-58 క్యాటగిరీలో సాయి చరణ్
61-64 కేటగిరిలో షేక్ నవాజ్ ఉర్ రెహమాన్
70 కిలోల పైన విభాగంలో వై హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపీక అయినారు

.

అలాగే బాలికల విభాగంలో 43-46 కేటగిరిలో ఆర్. జాష్ణవి లత విజేతలుగా నిలిచారు వీరందరూ కడప జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరపున విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు