రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రెడ్డి కుమారుని వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు

పయనించే సూర్యుడు, జూలై 6 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండల ప్రతినిధి: స్వాతి, నర్సిములు): హైదరాబాద్ లోని లియో కన్వెన్షన్ హాల్ లో అత్యంత వైభవంగా జరిగిన రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలకు జహీరాబాద్ శాసనసభ్యుడు కొనింటి మాణిక్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ శుభకార్యంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు నూతన వధూవరులను పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించి తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి దాంపత్య జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ వివాహ మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మాజీ జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ శివకుమార్, మాజీ జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ తంజిం, మాజీ సర్పంచ్ చిన్న రెడ్డి మరియు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను దీవించారు.