రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్థిక నిధులు మాదల పంచాయతీకి అందించాలని వినతి పత్రం ఎంపీడీవో కు అందజేసిన ప్రజానాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 2 అరకులోయ టౌన్ రిపోర్టర్ టి నీలకంఠం అరకు నియోజకవర్గ పరిధిలోగల అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువెల్లి మండలం మాదల గ్రామపంచాయతీకి చెందిన ప్రజా సంఘ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ అభివృద్ధి కొరకు కేటాయించాలని ఈరోజు అరకు వ్యాలీ మండలం మండల ఎంపీడీవో మరియు మాదల పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎన్నికైన ప్రసాద్ కలిసీ మాదల పంచాయతీ సమస్య వివరించడమైనది, సమస్య కచ్చితంగా పరిష్కరించుటకు మనమందరం కూడా ముందుకు వెళ్దామని సానుకూలంగా స్పందించిన మండల ఎంపీడీవో మెమోణన అందిస్తున్న పంచాయతీ వివిధ గ్రామ నాయకులు ఈ కార్యక్రమానికి గిరిజన సంఘ నాయకులు కుమిడి రమేష్ పెస కమిటీ సిరిగాం గురుమూర్తి పంచాయతీ నాయకులు సోమేలి సన్యాసి, గూబయి,ఆనందరావు, జర్ర మద్దు, సోమేశ్రావు తదితరులు పాల్గొన్నారు