రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో కాంస్య పథకంతో మెరిసిన కడప క్రీడాకారుడు నవాజ్ ఉర్ రెహమాన్

పయనించే సూర్యుడు న్యూస్: కడప 16 : ఈనెల 12 13 14 తేదీలలో విజయనగరం జిల్లాలో నిర్వహించిన బాక్సింగ్ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలలో కడప క్రీడాకారుడు నవాజ్ ఉర్ రెహమాన్ కాంస్య పథకం సాధించారు..

..

.

ఇతను కడప కె.ఆర్.ఆర్.ఎమ్. స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు క్రీడల పైన అమిత ఆసక్తి వల్ల తను బాక్సింగ్ క్రీడా ఎంచు కొన్నారు బాక్సింగ్ శిక్షణ తీసుకున్న తక్కువ సమయంలోనే ఉత్తమ ప్రతిభ చూపిస్తూ కడపకు పథకం సాధించారు

ఈ విజయం పట్ల వారి తల్లిదండ్రులు ఇంతియాజ్ రెహమాన్ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు తమ కుమారుడు ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని వారు కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కడప జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేష్ కొన్నిపాటి మరియు ప్రధాన కార్యదర్శి ఎమ్. విజయభాస్కర్ రెడ్డి పాల్గొని క్రీడాకారుడుని అభినందించినారు