పయనించే సూర్యుడు జూన్ 3 ఆదోని రూరల్ రిపోర్టర్. ఆదోని పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదవతరగతి చదువుతున్న ఎస్ సాత్విక్ 2025-26 సంవత్సరపు పదవతరగతి పరీక్షలు రాసి 594/600 మార్కులు సాధించాడు. తరువాత రివ్యలవేషన్ పెట్టగా సైన్ లో 1మార్క్, ఇంగ్లీషులో 1మార్క్ పెంచుకొని 596/600 మార్కులు సాధించి టౌన్ టాపర్ గా నిలిచాడు.ఈ సందర్భంగా ఏజీఎం సురేష్ ఆర్ ఐ రంగారెడ్డి ఆ విద్యార్థిని అభినందించారు.పాఠశాల ప్రిన్సిపల్స్ హరికృష్ణ , గౌసియ మాట్లాడుతూ సాత్విక్ తన శ్రమ, కృషి, పట్టుదలతో ఈ అద్భుతాన్ని సాధించాడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ నాగేశ్వరరావు , డీన్ రఘువీర్ , ఏవో అశోక్ , ప్రైమరీ ఇన్చార్జి విజయలక్ష్మి అలాగే పాఠశాల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.