రివ్యాలువేషన్ లో శ్రీచైతన్య పాఠశాల విద్యార్థికి పెరిగిన మార్కులు 598/600

పయనించే సూర్యుడు జూన్ 6 ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. ఆదోని పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలలో పదవతరగతి చదువుతున్న . సాత్విక్ 2025-26 సంవత్సరపు పదవతరగతి పరీక్షలు రాసి 594/600 మార్కులు సాధించాడు. తరువాత రివ్యాలువేషన్ పెట్టగా సైన్స్ లో 1మార్క్, ఇంగ్లీషులో 1మార్క్, సోషల్ లో 2 మార్కులు పెంచుకొని 598/600 మార్కులు సాధించి స్టేట్ 2nd టాపర్ గా డిస్టిక్ 1st టాపర్ గా నిలిచాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి , ఏజీఎం సురేష్ , ఆర్ ఐ రంగారెడ్డి సాత్విక్ తల్లిదండ్రులను సన్మానించారు. పాఠశాల ప్రిన్సిపల్స్ హరికృష్ణ గౌసియ మాట్లాడుతూ సాత్విక్ తన శ్రమ, కృషి, పట్టుదలతో ఈ అద్భుతాన్ని సాధించాడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ నాగేశ్వరరావు , ఏవో అశోక్ డీన్ లు రఘువీర్ , రాంబాబు , ప్రైమరీ ఇన్చార్జులు విజయలక్ష్మి , లలిత , అలాగే పాఠశాల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.