రీజనల్ రింగ్ రోడ్ భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి, నేషనల్ హైవే అధికారులకు భూమిని అప్పగించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మే 26 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని సమీకృత కార్యాలయ సముదాయంలోని ఆర్డీఓ ఛాంబర్ లో రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం కోసం రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్, ఆర్డీఓ చంద్రకళ తో కలసి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు రీజినల్ రింగ్ రోడ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ పెద్ద ప్రాజెక్టును మన జిల్లాలో రాయపోల్, వర్గల్, మర్కుక్, గజ్వేల్, జగదేవ్ పూర్ మండలాల ద్వారా వెళ్తుందని భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చెయ్యాలని ఆదేశించారు. ఆయా మండలాల వారిగా భూ సేకరణ వివరాల గూర్చి రెవెన్యూ అధికారులతో చర్చించి ఆయా గ్రామాల వారిగా ఒక పక్క ప్రణాళిక తో భూ సేకరణ చేయాలని రీజనల్ రింగ్ రోడ్డు వలన ఆయా ప్రాంతాలు ఎలా అభివృద్ది చెందుతాయి క్లుప్తంగా వారికి వివరించాలి.

ఆయా గ్రామాల్లో భూమిని సేకరించి నష్టపరిహారం అందిన తర్వాత వారి నుండి భూమి రెవెన్యూ అధికారులు అధీనంలోకి తీసుకోవాలి.

ఈ మొత్తం ప్రక్రియలను ఆర్డీఓ ఆధ్వర్యంలో తహసీల్దార్లు ఇతర సిబ్బంది భూ సేకరణ యుద్ధ ప్రాతిపదకన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సేకరణ పూర్తి చేసిన నేషనల్ హైవే అధికారులకు నియమావళి ప్రకారం వారికి అప్పగించాలని ఆదేశించారు.