పయనించే సూర్యుడు మే 24, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయ రంగ ప్రవేశం చేసి అభివృద్ధి లక్ష్యంగా కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ ఎన్నికైన నాటినుండి నేటి వరకు సుమారు రూ. 260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారని మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల ఆలోచనలకు అనుగుణంగా పార్టీలకు అతీతంగా ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజలతో మమేకమై అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని అన్నారు. అదేవిధంగా సుమారు రూ. 650 కోట్లు సంక్షేమ పథకాల ద్వారా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పథకాల అమలు ,ప్రజాసంతృప్తి వంటి అంశాల ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్వహించిన సర్వేలో కాకినాడ జిల్లాలో ఎమ్మెల్యే నానాజీ ద్వితీయ స్థానంలో నిలబడడం గర్వకారణం అన్నారు. శాసనసభలో పంచాయతీల విలీనం, 15వ ఆర్థిక సంఘం నిధులు, స్టాంప్ డ్యూటీ ,డ్రైనేజీల ఆక్రమణలు, తాగునీరు వంటి సమస్యలను ప్రస్తావించి శాస్త్రీయ పరిష్కారానికి సూచనలు చేశారని అన్నారు. కూటమి నాయకులతో సఖ్యతగా ఉంటూ ప్రజల మనోబీష్టానికి అనుకూలంగా నియోజకవర్గం అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే నానాజీ రానున్న కాలంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపట్టి ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఎన్నుకున్న నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడతారన్న ఆశాభావాన్ని అడబాల వ్యక్తం చేశారు.